స్విమ్స్‌లో మొదలైన ప్లాస్మా థెరపీ

ABN , First Publish Date - 2020-06-06T10:23:24+05:30 IST

కొవిడ్‌-19 చికిత్సలో కీలకమైన ప్లాస్మా థెరపీ ప్రక్రియ స్విమ్స్‌లో మొదలైంది

స్విమ్స్‌లో మొదలైన ప్లాస్మా థెరపీ

ఇద్దరు కరోనా రోగుల ఎంపిక


తిరుపతి,  జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 చికిత్సలో కీలకమైన ప్లాస్మా థెరపీ ప్రక్రియ స్విమ్స్‌లో మొదలైంది. ఇప్పటికే ఇద్దరు కరోనా రోగులను ఎంపిక చేసి పరిశీలనలో ఉంచారు. ప్రస్తుతం ఒక రోగికి స్టాండర్డ్‌ సీరమ్‌ మేనేజ్‌మెంట్‌ పద్ధతి అనుసరిస్తున్నారు. స్విమ్స్‌లో మే 12 నుంచి ఇప్పటి వరకు డిశ్చార్జయిన 8 మంది నుంచి ప్లాస్మా కణాలును సేకరించి భద్రపరిచారు. వైరస్‌తో బాధపడుతున్న సీరియస్‌ కేసులకు ఈ కణాలను ఎక్కించడం ద్వారా వైరల్‌ యాంటీ బాడీస్‌ పెరిగి కోలుకునే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి నుంచి తీసుకున్న రక్తాన్ని అదే గ్రూపునకు చెందిన ఇద్దరికి ప్లాస్మా కణాలను ఎక్కించవచ్చు. ప్రస్తుతం ప్లాస్మా థెరపీ చేస్తున్న రోగుల ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ భూమా వెంగమ్మ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.  ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలనే తామూ అనుసరిస్తున్నామని, వారు సూచించిన రోగులకే థెరపీ చేస్తున్నామన్నారు.

Updated Date - 2020-06-06T10:23:24+05:30 IST