రేషన్‌ బియ్యంలో ప్లాస్టిక్‌ బియ్యం

ABN , First Publish Date - 2021-06-17T07:22:01+05:30 IST

మండల కేంద్రమైన రామకుప్పంలో ప్రభుత్వం పంపిణీ చేసిన రేషన్‌ బియ్యంలో ప్లాస్టిక్‌ బియ్యం కలిసినట్టు పలువురు కార్డుదారులు తెలిపారు. ఈ నెల పంపిణీ చేసిన రేషన్‌బియ్యాన్ని నీటిలో వేస్తే కొంత మేర బియ్యంపైకి తేలుతోందన్నారు.

రేషన్‌ బియ్యంలో ప్లాస్టిక్‌ బియ్యం
రేషన్‌బియ్యంలో వెలుగు చూసిన ప్లాస్టిక్‌ బియ్యం

రామకుప్పం, జూన్‌ 16: మండల కేంద్రమైన రామకుప్పంలో ప్రభుత్వం పంపిణీ చేసిన రేషన్‌ బియ్యంలో ప్లాస్టిక్‌ బియ్యం కలిసినట్టు పలువురు కార్డుదారులు తెలిపారు. ఈ నెల పంపిణీ చేసిన రేషన్‌బియ్యాన్ని నీటిలో వేస్తే కొంత మేర బియ్యంపైకి తేలుతోందన్నారు. బియ్యాన్ని వండితే గంజిలా మారి, కాసేపు ఆరబెట్టగా గట్టిగా మారిందన్నారు. దీంతో తాము బియ్యంలో ప్లాస్టిక్‌ బియ్యం కలిసిందని నిర్ధారించుకున్నామన్నారు. 250గ్రాముల రేషన్‌ బియ్యంలో 25గ్రాముల ప్లాస్టిక్‌ బియ్యం ఉందని వారు తెలిపారు.


Updated Date - 2021-06-17T07:22:01+05:30 IST