కరోనాతో పెట్టుకున్నాడు... ప్రాణాలే కోల్పోయాడు

ABN , First Publish Date - 2020-07-13T23:40:27+05:30 IST

కరోనాతో గేమ్స్ ఆడిన ఓ యువకుడు చివరకు ప్రాణాలే కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరలవుతోంది. అమెరికాలో జరిగిన ఈ ఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి. టెక్సస్‌కు చెందిన ఓ యువకుల బృందంలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది.

కరోనాతో పెట్టుకున్నాడు... ప్రాణాలే కోల్పోయాడు

టెక్సస్ : కరోనాతో గేమ్స్ ఆడిన ఓ యువకుడు చివరకు ప్రాణాలే కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరలవుతోంది. అమెరికాలో జరిగిన ఈ ఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి. టెక్సస్‌కు చెందిన ఓ యువకుల బృందంలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది.


అయితే పాజిటివ్ వచ్చిన యువకుడు... ‘కరోనాకు ఎవరైతే భయపడరో... వారు నాతో పార్టీకి రండి’ అంటూ స్నేహితులతో పందెం కాశాడు. ఈ క్రమంలో...  అతడితో పాటు వెళ్ళిన ఓ యువకుడికి కొద్ది రోజుల్లోనే కరోనా పాజిటివ్ అని తేలింది.


అతడికి... కొద్ది రోజుల్లోనే ఊపిరితిత్తులు పనిచేయకుండా పోయాయి.గాలి పీల్చడం ఎంతో కష్టంగా అనిపించింది. దాంతో తాను పొరపాటు చేశానని భావించిన అతడు చనిపోయే కొన్ని గంటల ముందు అక్కడి వైద్యులతో ‘నేను తప్పు చేశాను’ అని చెబుతూనే ప్రాణాలు విడిచిపెట్టాడు. 


Updated Date - 2020-07-13T23:40:27+05:30 IST