ఉద్యోగాలు కాపాడండి

ABN , First Publish Date - 2021-01-27T06:44:44+05:30 IST

తమ ఉద్యోగాలు, తమపై ఆధారపడిన వారి జీవితాలను కాపాడాలని పలువురు మంగళవారం బీసీ సంక్షేమశాఖామంత్రి చెల్లుబోయిన వేణుగోపాకృష్ణను వేడుకున్నారు.

ఉద్యోగాలు కాపాడండి

మంత్రి వేణుకు  వినతి 

రామచంద్రపురం, జననరి 26: తమ ఉద్యోగాలు, తమపై ఆధారపడిన వారి జీవితాలను కాపాడాలని పలువురు మంగళవారం బీసీ సంక్షేమశాఖామంత్రి చెల్లుబోయిన వేణుగోపాకృష్ణను వేడుకున్నారు. రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న స్టాఫ్‌నర్సులు, ఫిమేల్‌ నర్సింగ్‌ వర్కర్లు, మేల్‌ నర్సింగ్‌ వర్కర్లు, స్వీపర్లను ప్రభుత్వం తొలగించింది.  ఈసందర్భంగా వారు మంత్రికి వినతిపత్రం అందజేసి తమ గోడును వివరించారు.



Updated Date - 2021-01-27T06:44:44+05:30 IST