Abn logo
Apr 17 2021 @ 00:45AM

జడ్జి రామకృష్ణను వెంటనే విడుదల చేయాలి

మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బండి ఈశ్వర్‌ 

 పీలేరు, ఏప్రిల్‌ 16:  జడ్జి రామకృష్ణను వెంటనే విడుదల చేయాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బండి ఈశ్వర్‌ డిమాండ్‌ చేశారు. పీలేరు సబ్‌జైలులో ఉన్న జడ్జిని ఆయన శుక్రవారం పరామర్శించారు. అనంతరం మాట్లా డుతూ ఒక టీవీ చర్చలో ముఖ్యమంత్రి గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుతో జడ్జిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అప్పటి సీఎం చంద్రబాబును నడిరోడ్డులో కాల్చి చంపాలని పిలుపునిచ్చారని, అప్పుడు జగన్మోహన్‌రెడ్డికి వర్తించని చట్టం ఇప్పుడు జడ్జి రామకృష్ణకు ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు.  దళితులను అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి తన విధానాలను మార్చుకోవాలని, లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. జడ్జి రామకృష్ణను విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాసంఘాలతో ఆందోళనలు చేస్తామని స్పష్టం చేశారు. ఇదిలావుండగా కర్నూలు కాంగ్రెస్‌ నాయకుడు అశోకరత్నం, పలు సంఘాల నాయకులు జడ్జి రామకృష్ణను పరామర్శించారు. అలాగే జడ్జి కుమారుడు వంశీకృష్ణకు ధైర్యం చెప్పారు. 

Advertisement
Advertisement
Advertisement