మా బాబును ఈ బాధ నుంచి తప్పించండి

ABN , First Publish Date - 2020-11-07T21:39:02+05:30 IST

"కడుపున పుట్టిన చిన్నారి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంటే ఏ తల్లిదండ్రులకైనా అంతకంటే పీడకల మరొకటి ఉండదు. ఈ బాధ నుంచి తప్పించమని అర్థిస్తున్నట్టుగా ఆ పసివాళ్ళు కన్నీరు కారుస్తుంటే...

మా బాబును ఈ బాధ నుంచి తప్పించండి

"కడుపున పుట్టిన చిన్నారి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంటే ఏ తల్లిదండ్రులకైనా అంతకంటే పీడకల మరొకటి ఉండదు. ఈ బాధ నుంచి తప్పించమని అర్థిస్తున్నట్టుగా ఆ పసివాళ్ళు కన్నీరు కారుస్తుంటే... ఎంత ప్రయత్నించినా మేము నిస్సహాయులుగా మిగిలిపోయాం. ఒక పీడకల మా బాబు విషయంలో నిజమైంది. అసలేం జరుగుతోంది?" అంటూ మాతృమూర్తి జఫ్రినా వేదనతో రోదిస్తోంది.


ఆసుపత్రిలో తన కొడుకు లైఫ్ సపోర్ట్ యంత్రాలతో వెంటిలేటర్ ద్వారా శ్వాస తీసుకుంటుంటే జఫ్రీన్ ఆవేదనతో చూస్తోంది. గొట్టాలు గుచ్చిన ఆ చిన్నారి లేత చర్మాన్ని చూస్తూ కన్నీరు కార్చుతోంది. బాబును అల్లా తప్పక రక్షిస్తాడంటూ ఆమెను ఓదార్చేందుకు భర్త మెహ్రాజ్ ప్రయత్నిస్తున్నాడు.


ఎన్ఐసీయూలో ఉన్న జఫ్రీన్ కొడుకుని డాక్టర్లు నిరంతరం గమనిస్తున్నారు. ఆ పసివాడు త్వరగా కోలుకునేందుకు యాంటీబయాటిక్స్, ఇతర సప్లిమెంట్స్ ఇస్తున్నారు. అయితే, చికిత్స కోసం ఆ బాబును ఎన్ఐసీయూలో కనీసం నెల రోజులైనా ఉంచేలా అడ్మిట్ చెయ్యాలని చెప్పారు. ఇందుకు దాదాపు రూ.4.92 లక్షలు (సుమారు 6,622.25 డాలర్లు) ఖర్చవుతుంది. జఫ్రీన్ కుటుంబానికి ఇది భరించలేనంత పెద్ద ఆర్థిక భారం.


తల్లిగా జఫ్రిన్ పరిస్థితి గురించి ఆమె భర్త మెహ్రాజ్ ఆవేదనతో వివరించాడు. "ఆ రోజు నాకింకా గుర్తుంది. జఫ్రీన్ కాలు వాచిపోవడం మొదలైంది. తనకు రక్తపోటు కూడా చాలా ఎక్కువైపోయింది. డాక్టర్లు పరీక్ష చేసి జఫ్రీన్‌కి గుండె సమస్యలు ఉన్నందువల్ల వెంటనే డెలివరీ చెయ్యాలని, లేకుంటే తన పరిస్థితి మరింత విషమించే అవకాశముందని చెప్పారు. తర్వాత, జఫ్రీన్ ప్రీమెచ్యూర్ కండిషన్‌లో ఉన్న బాబుకు జన్మనిచ్చిందని మాతో అన్నారు. నేను పూర్తిగా కుమిలిపోయాను. నా కుటుంబం ఉన్న పరిస్థితిని తలుచుకుని నన్ను నేనే తిట్టుకున్నాను" అని వికల మనస్సుతో ఏడుస్తూ చెప్పాడు.


మెహ్రాజ్ తన కుటుంబ పోషణకు కావలసిన ఆహారాన్ని మాత్రం సంపాదించుకోగల డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. వారిది డబ్బు పొదుపు చేసుకునే స్థితి కాదు. తన బాబుకు వైద్యం చేయించాలంటే బంధుమిత్రుల నుంచి అప్పు చెయ్యాలి. ప్రస్తుతం ఆస్పత్రి ఖర్చులు భరించేందుకు కావలసిన మొత్తం వారి దగ్గర లేదు.



తమను ఆదుకునేవారు లేరని ఈ తల్లిదండ్రులు గుండెలవిసేలా కన్నీరు కార్చుతున్నారు. తమ బాబును కాపాడేందుకు ఎవరో ఒకరు రాకపోతారా... అనే ఆశతో రోజంతా ప్రార్థనలు చేస్తున్నారు. ఆ ఒకరు మీరే కావచ్చు. ఉదార హృదయంతో మీరు ఆర్థిక సహాయం చేస్తే జఫ్రీన్ కుమారుడికయ్యే వైద్య ఖర్చులు చెల్లించి ఆ చిన్నారిని కాపాడుకోగలుగుతారు. 


దయచేసి విరాళాలు ఇవ్వండి...

Updated Date - 2020-11-07T21:39:02+05:30 IST