దయచేసి మీ డబ్బు తీసుకోండి

ABN , First Publish Date - 2020-02-14T06:49:02+05:30 IST

తనకు ఇచ్చిన అసలులో వంద శాతాన్ని వెనక్కి తీసుకోవాలని భారత బ్యాంకులను లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా గురువారంనాడు మరోమారు కోరారు. ‘‘రెండు చేతులు జోడించి అడుగుతున్నా మీరు...

దయచేసి మీ డబ్బు తీసుకోండి

బ్యాంకులను కోరిన విజయ్‌ మాల్యా


లండన్‌: తనకు ఇచ్చిన అసలులో వంద శాతాన్ని వెనక్కి తీసుకోవాలని భారత బ్యాంకులను లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా గురువారంనాడు మరోమారు కోరారు. ‘‘రెండు చేతులు జోడించి అడుగుతున్నా మీరు ఇచ్చిన అసలులో వంద శాతాన్ని వెంటనే వెనక్కి తీసుకోండి’’ అని లండన్‌లోని రాయల్‌ కోర్ట్స్‌ ఆఫ్‌ జస్టిస్‌ వెలుపల మాల్యా అన్నారు. ‘‘నేను తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడం లేదని బ్యాంకులు ఫిర్యాదు చేయడంతో ఎన్‌ఫోన్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆస్తులను జప్తు చేసింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద నేను ఎలాంటి నేరం చేయలేదు. కానీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సుమోటోగా నా ఆస్తులను జప్తు చేసింది’’ అని మాల్యా అన్నారు. ‘‘బ్యాంకులు దయచేసి మీ సొమ్మును తీసుకోండి. ఒకే రకమైన ఆస్తుల కోసం అటు ఈడీ, ఇటు బ్యాంకులు పోరాడుతున్నాయి’’ అని మాల్యా అన్నారు. 

Updated Date - 2020-02-14T06:49:02+05:30 IST