Abn logo
May 13 2021 @ 00:00AM

స్టోరేజి బ్యాటరీల తయారీకి పీఎల్‌ఐ విస్తరణ

న్యూఢిల్లీ: ఉత్పత్తితో ముడిపడిన   ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకాన్ని స్టోరే జి బ్యాటరీల తయారీకి విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో ఈ తరహా బ్యాటరీల తయారీని పెంచేందుకు ముందుకు వచ్చే సంస్థలకు రూ.18,100 కోట్ల ప్రోత్సహకాలు ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో దేశ, విదేశీ సంస్థల నుంచి రూ.45,000 కోట్ల పెట్టుబడులు సమకూరే అవకాశం ఉందన కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ చెప్పారు. దీని వల్ల దేశంలో 50,000 మెగావాట్ల స్టోరేజ్‌ బ్యారీల ఉత్పత్తి సామర్ధ్యం ఏర్పడుతుందన్నారు. 

Advertisement