Abn logo
Sep 14 2021 @ 18:37PM

ఓఆర్‌ఆర్‌ నిర్వాసితులకు ప్లాట్లు

హైదరాబాద్: ఓఆర్‌ఆర్‌ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్లాట్లును హెచ్ఎండీఏ  కేటాయించనుంది. బుధవారం 17 మంది భూ నిర్వాసితులకు ప్లాట్లను హెచ్ఎండీఏ కేటాయించనుంది. నానక్‌రామ్‌గూడలోని హెచ్‌జీసీఎల్ ఆఫీస్‌లో ప్లాట్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ జరుగనుంది. ఓఆర్ఆర్ ప్రాజెక్టులో మొత్తం 160 మందిని నిర్వాసితులుగా ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే 133 మంది నిర్వాసితులకు ప్లాట్లును హెచ్ఎండీఏ అందించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం శ్రీనగర్‌లోని 17 ప్లాట్లను నిర్వాసితులకు హెచ్ఎండీఏ అందించనుంది.