ఒమర్ అబ్దుల్లా నిర్ణయాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2020-03-30T19:50:21+05:30 IST

నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆదివారం

ఒమర్ అబ్దుల్లా నిర్ణయాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ

శ్రీనగర్ : నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆదివారం రాత్రి ఒమర్ అబ్దుల్లా మామయ్య మహ్మద్ అలీ మట్టూ తీవ్ర అనారోగ్యం కారణం కన్నుమూశారు. దీంతో ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ... దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉందని, మామయ్య చనిపోయినా సరే, ఎవ్వరూ అధిక సంఖ్యలో గుమిగూడవద్దని ఆయన ట్విట్టర్ వేదికగా కోరారు. ‘‘మా మామయ్య డా. మహ్మద్ అలీ మట్టూ అనారోగ్యం కారణంగా మరణించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటి ముందుగానీ, లేదా శ్మశానవాటిక ముందు గానీ అధిక సంఖ్యలో గుమిగూడకండి. ఈ కష్ట కాలంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించండి. మీరు మీ ఇంటి నుంచే ప్రార్థనలు చేయండి. అవి ఫలిస్తాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చుతాయి’’ అని ఒమర్ ట్వీట్ చేశారు. 


ఒమర్ తీసుకున్న ఈ  నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ‘‘మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను ఒమర్ అబ్దుల్లా. మీ మామయ్య ఆత్మకు శాంతి చేకూరుగాక. ఈ శోక సమయంలో కూడా ప్రజలు అధిక సంఖ్యలో గుమిగూడవద్దని మీరిచ్చిన పిలుపు ప్రశంసనీయం. కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా దేశం చేస్తున్న యుద్ధానికి మీరు మరింత శక్తిని చేకూర్చారు’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌పై ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ‘‘సంతాప సందేశాన్ని పంపింనందుకు మీకు మా కుటుంబం తరపున ధన్యవాదాలు. వారి ఆత్మకోసం మీరు చేసిన ప్రార్థన ప్రశంసించదగింది.’’ అని ఒమర్ ట్వీట్ చేశారు.

Updated Date - 2020-03-30T19:50:21+05:30 IST