Abn logo
Jun 11 2021 @ 15:38PM

పీఎం కిసాన్ తొమ్మిదో విడత... ఆగస్టు నుంచి...

న్యూఢిల్లీ : ‘పీఎం కిసాన్ సమ్మాన్ యోజన’ కింద ఇప్పటివరకు రూ. 1.27 లక్షల కోట్లను 10.90 కోట్ల మంది రైతుల ఖాతాల్లో వేసినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెవెల్లడించారు. ఈ పథకాన్ని 2019 లో ప్రారంభించిన విషయం తెలిసిందే. సంవత్సరానికి రూ. 6 వేల చొప్పున రైతులకు ఈ పథకం కింద అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు ఎనిమిది వాయిదాలను రైతుల ఖాతాలకు జమ చేసిందన్నారు. ఎనిమిదవ విడత రైతులకు చెల్లించే పనులు జరుగుతున్నాయన్నారు. జూలై 31 లోగా ఇది పూర్తిచేస్తామన్నారు. అనంతరం తొమ్మిదో విడత డబ్బును...  రైతుల ఖాతాలకు పంపేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సన్నాహాలు ప్రారంభించిదని చెప్పారు. 


ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ప్రతి సంవత్సరం రూ. 6 వేల చొప్పున రైతుల ఖాతాలకు అందిస్తున్న విషయం తెలిసిందే. ఎనిమిదవ విడత డబ్బును రైతుల ఖాతాల్లో జూలై 31 లోపు జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కాగా...  పీఎం కిసాన్ యోజన కొత్త విడత సన్నాహాలు ప్రారంభమయ్యాయి. కాగా... సాయం మొత్తాన్ని పెంచాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. కాగా...   ఆగస్టు నుంచి తొమ్మిదవ విడత పంపిణీకి ఏర్పాట్లు జరగనున్నాయి. ఈ పథకంలో ఇంకా నమోదు చేసుకోని రైతులు నమోదు చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రైతులు ఇప్పటికే నమోదు చేసుకున్నపక్షంలో... ఎనిమిదవ విడత రూ. 2 వేలను కూడా పొందవచ్చన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కోసం ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయవచ్చున్న విషయం తెలిసిందే. గత రెండు నెలల్లో రైతుల ఖాతాలకు రూ. 21 వేల కోట్లు జమయ్యాయి. 


అత్యంత విజయవంతమైన ప్రణాళిక...

వచ్చే ఏడాది(2022) నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని మోదీ  ప్రభుత్వం నిర్ణయించిన క్రమంలో... పీఎం కిసాన్ సమ్మాన్ యోజనను ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం రూ . 6 వేల చొప్పున రైతుల ఖాతాలకు జమచేస్తారు. కాగా... సంవత్సరానికి రూ . 24 వేలు పెంచాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. 

Advertisement
Advertisement
Advertisement