Abn logo
Aug 5 2020 @ 11:52AM

అయోధ్యకు చేరుకున్న మోదీకి సీఎం యోగి స్వాగతం

అయోధ్య : రామాలయానికి భూమి పూజ చేసేందుకు అయోధ్యకు హెలికాప్టరులో చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటించడంతోపాటు ప్రధాని, సీఎం లిద్దరూ మాస్క్ లు ధరించారు. కేఎస్ సాకేత్ పీజీ కళాశాల మైదానంలోని హెలిప్యాడ్ కు చేరిన ప్రధాని మోదీ ముందుగా హనుమాన్ గర్హి దేవాలయానికి బయలుదేరారు. పూజలు చేశాక ప్రధాని మోదీ రామాలయం భూమిపూజ స్థలానికి చేరుకుంటారు. 12.30 గంటలకు భూమి పూజ చేసిన తర్వాత ప్రధాని మోదీ ఆవరణలో పారిజాతం మొక్కను నాటుతారు. 

ఇవి కూడా చదవండిImage Caption

అయోధ్య హనుమాన్ మందిరంలో మోదీ పూజలు

Advertisement
Advertisement
Advertisement