కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నా.. బైడెన్‌కు మోదీ శుభాకాంక్షలు..

ABN , First Publish Date - 2021-01-21T04:47:24+05:30 IST

అగ్రరాజ్య అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రపంచ దేశాల నేతలు బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా బైడెన్‌కు కంగ్రాచ్యులేషన్స్

కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నా.. బైడెన్‌కు మోదీ శుభాకాంక్షలు..

న్యూఢిల్లీ: అగ్రరాజ్య అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రపంచ దేశాల నేతలు బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా బైడెన్‌కు కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. ‘‘అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్‌కు హృదయ పూర్వక అభినందనలు. బైడెన్ హయాంలో భారత్-అమెరికా వ్యూహాత్మక బంధాలను మరింత బలంగా చేసేందుకు కృషి చేస్తా. ఆయనతో కలిసి పని చేయడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’’ అని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

Updated Date - 2021-01-21T04:47:24+05:30 IST