దేశాన్ని ఉన్నత శిఖరాల్లో నిలపండి : మోదీ

ABN , First Publish Date - 2021-06-04T01:31:08+05:30 IST

పాఠశాలల్లో, కాలేజీల్లో ‘టీం స్పిరిట్’ గురించి బోధించేవారని, కరోనా సమయంలో దీనిని స్పష్టంగా చూశామని

దేశాన్ని ఉన్నత శిఖరాల్లో నిలపండి : మోదీ

న్యూఢిల్లీ : పాఠశాలల్లో, కాలేజీల్లో ‘టీం స్పిరిట్’ గురించి బోధించేవారని, కరోనా సమయంలో దీనిని స్పష్టంగా చూశామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కొంటామని అందరూ ధీమాగా ఉన్నారని తెలిపారు. సీబీఎస్‌ఈ పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖా విద్యార్థులు, తల్లిదండ్రులతో వెబినార్ నిర్వహించింది. ఈ వెబినార్‌కు ప్రధాని మోదీ హఠాత్తుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఆయన షెడ్యూల్‌లో లేదు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... విద్యార్థులందరూ దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారన్న నమ్మకంతో ఉన్నానని వ్యాఖ్యానించారు. ఎప్పుడూ భవిష్యత్ గురించి ఆలోచించాలని, జూన్ 1 వ తేదీ వరకూ పరీక్షల గురించి ఆలోచించేవారని మోదీ అన్నారు. దీనికి ఓ విద్యార్థి సమాధానమిస్తూ... ‘‘సార్... మీరు పరీక్షలను ఓ పండగలా భావించాలని గతంలో చెప్పారు. అందుకే మాకు పరీక్షలంటే భయమే లేదు’’ అని బదులిచ్చింది. మరోవైపు సీబీఎస్‌ఈ పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను మోదీ అడిగి తెలుసుకున్నారు. 

Updated Date - 2021-06-04T01:31:08+05:30 IST