Advertisement
Advertisement
Abn logo
Advertisement

పీఎం మోదీకి రైతుల ఉసురు తప్పదు

 సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి 

యాదాద్రిరూరల్‌, డిసెంబరు 3: రైతులకు వ్యతిరేకంగా కేంద్రప్రభు త్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయడానికి 750 మంది రైతులు బలిదానం చేసుకున్నారని వారి ఉసురు ప్రధాని నరేంద్రమోదీకి తగులుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం గు ట్టలో రెండు రోజులుగా జరుగుతున్న సీపీఐ ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయ శిక్షణ ముగింపు సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రైతులు మృతితో కేంద్రప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగి నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిందని తెలిపారు. గతంలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ఒక్కొక్కటిగా కార్పొరేట్‌ శక్తులకు అంటగడుతూ ప్రైవేటుపరం చేస్తోందని అన్నారు. ప్రధానంగా ఎల్‌ఐసీ, బీఎ్‌సఎల్‌ఎన్‌, ఉక్కు పరిశ్రమ ఇలా అనేక రంగ సంస్థలను ధారాదత్తం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో క ష్టపడి రైతులు ధాన్యం పండిస్తే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, డ్రామాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఆందోళనకు గురైన కొందరు రైతులు ధాన్యం కుప్పలపై మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశా రు. వారి మృతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. డ్రామాలు మాని రైతులను ఇబ్బందులు పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు. ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఆర్టీసీ చార్జీలు పెంచడంతో మరింత భారం పడుతోంద ని పేర్కొన్నారు. ప్రజలు ఏకతాటిపై వచ్చి పాలకులకు తగిన గుణపాఠం చె ప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ప ల్లా నర్సింహారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట జిల్లా కార్యదర్శులు వెలికంటి స త్యం, బెజవాడ వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శులు యానాల దామోదర్‌రెడ్డి, బొలగాని సత్యనారాయణ, కొల్లూరు రాజయ్య, బండి జంగమ్మ, మండ ల కార్యదర్శి బబ్బూరి శ్రీధర్‌, గుట్ట మున్సిపల్‌ కోఆఫ్షన్‌ సభ్యుడు పేరబోయి న పెంటయ్య, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గోరేటి రాములు, సీపీఐ మం డల సహాయ కార్యదర్శి కల్లేపల్లి మహేందర్‌, నాయకులు రాజు, బంగారి, నరేష్‌, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనగోళ్లు వేగవంతం చేయాలి

మోటకొండూరు: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మండల కేంద్రానికి చెందిన సీపీఐ సీనియర్‌ నాయకులు రేగు సిద్దయ్య కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం ఆయన స్వగృహంలో పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బొలగాని సత్యనారాయణ, మండల కార్యదర్శి గ్యాదగాని మాణిక్యం, సహాయ కార్యదర్శి పెంటారెడ్డి, నాయకులు శ్రీనివాస్‌, బీరకాయల మల్లేశ, గణేష్‌, పాండు, శ్రీధర్‌, ప్రదీ్‌పరెడ్డి, కరుణాకర్‌ పాల్గొన్నారు. Advertisement
Advertisement