నొప్పిని భరిస్తూనే భూమిపూజలో మోదీ.. ఫోటో వైరల్..!

ABN , First Publish Date - 2020-08-05T19:34:55+05:30 IST

కోట్లాది మంది హిందువుల కలలు నిజంచేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ అయోధ్య రామమందిర..

నొప్పిని భరిస్తూనే భూమిపూజలో మోదీ.. ఫోటో వైరల్..!

న్యూఢిల్లీ: కోట్లాది మంది హిందువుల కలలు నిజంచేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ అయోధ్య రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దేశవ్యాప్తంగా కొవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అతికొద్ది మందిని మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అయినప్పటికీ దేశంలోని భక్తులందరి ప్రతినిధిగా తాను భూమిపూజలో పాల్గొంటున్నట్టు ప్రకటించిన మోదీ... అన్నట్టుగానే ఇవాళ అన్ని జాగ్రత్తలతో అయోధ్య పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన భూమిపూజ కార్యక్రమం ఆసాంతం ఎన్-95 మాస్క్ ధరించారు. దీంతో ఆయన ముఖంపైనా, చెవుల వెనుక చర్మం ఒరుకుసుకుపోయింది. చెవులు ముందుకు లాగేసి కనిపించాయి. పలువురు నెటిజన్లు ఆయన ఆ ఫోటోలను చూసి తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆయన కూడా మానవమాత్రుడే కాబట్టి కచ్చితంగా నొప్పివచ్చి ఉంటుందనీ... అయినప్పటికీ రామమందిర నిర్మాణం జరుగుతున్న సంతోషంలో ఈ చిన్నపాటి నొప్పి ఆయన్ను బాధించలేదని కామెంట్లు పెడుతున్నారు.


అయితే మాస్కులు ధరించినందుకు కూడా నొప్పి పుడుతుందా అని మరికొందరు వాదిస్తున్నప్పటికీ.. గతంలో మాస్కులు ధరించడం వల్ల కలిగే ఇబ్బందులపై చాలా వార్తలు వచ్చాయి. కరోనా మహమ్మారితో పోరాడుతున్న ఎంతోమంది వైద్యులు, నర్సులు ఎన్-95 మాస్కుల ఒరిపిడి వల్ల తమ ముఖాలపై పడిన గాయాలు చూపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఏదేమైనా మోదీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయోధ్య పర్యటనకు వెళ్లి భూమిపూజ నిర్వహించడం తేలికైన విషయమేమీ కాదనీ.. ఇది ఆయన సంకల్పానికి, నిశ్చయానికి నిదర్శనమని చెబుతున్నారు. 

Updated Date - 2020-08-05T19:34:55+05:30 IST