ప్రధాని మోదీ 83 రోజుల తర్వాత మొదటిసారి ఇంటి నుంచి కాలు బయటపెట్టారు...

ABN , First Publish Date - 2020-05-22T17:01:18+05:30 IST

దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి అధికారిక నివాసం నుంచే పాలన సాగిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ 83రోజుల తర్వాత మొట్టమొదటిసారి ఇంటి నుంచి కాలు బయటపెట్టారు....

ప్రధాని మోదీ 83 రోజుల తర్వాత మొదటిసారి ఇంటి నుంచి కాలు బయటపెట్టారు...

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి అధికారిక నివాసం నుంచే పాలన సాగిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ 83రోజుల తర్వాత మొట్టమొదటిసారి ఇంటి నుంచి కాలు బయటపెట్టారు. ‘ఆంఫన్’ తుపాన్ ప్రభావం వల్ల పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆంఫన్ తుపాన్ బీభత్సం సృష్టించిన నేపథ్యంలో నష్టాన్ని పరిశీలించేందుకు పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రధానమంత్రి మోదీ శుక్రవారం ఏరియల్ సర్వే చేశారు. కరోనా వైరస్ ప్రబలటానికి ముందు ప్రధాని మోదీ చివరిసారిగా ఫిబ్రవరి 29వతేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్, చిత్రకూట్ ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా లాక్ డౌన్ వల్ల ప్రధాని మోదీ దాదాపు మూడు నెలలపాటు ఇంటికే పరిమితమై కాలు బయటపెట్టలేదు. కరోనాను కట్టడి చేసేందుకు ఇంట్లోనే సురక్షితంగా ఉండండి అంటూ మోదీ ప్రజలకు పిలుపు ఇచ్చి తాను ఇంట్లోనే ఉంటూ మూడుసార్లు లాక్ డౌన్ పొడిగించారు. తుపాన్ సృష్టించిన బీభత్సం జాతీయ అత్యవసర పరిస్థితి కావడంతో ప్రధాని మోదీ కోల్ కతా, 24 పరగణాస్ ప్రాంతాల్లో పర్యటించారు. తుపాన్ ప్రభావ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన ప్రధానమంత్రి సహాయ పునరావాస పనుల గురించి సమీక్షించనున్నారు. తుపాన్ ప్రభావం వల్ల 80 మంది మరణించడంతోపాటు పలు ప్రాంతాల్లో వంతెనలు కొట్టుకుపోయాయి. విద్యుత్, టెలికం రంగానికి తుపాన్ వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. 

Updated Date - 2020-05-22T17:01:18+05:30 IST