ఇటలీ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ

ABN , First Publish Date - 2021-10-29T19:34:35+05:30 IST

16వ జీ-20 సదస్సు నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటలీ చేరుకున్నారు. ఆయన ఇటలీ రాజధాని రోమ్‌కు శుక్రవారం మధ్యాహ్నం చేరుకున్నారు. ఇటలీ ప్రధానమంత్రి మరియో డ్రగి మోదీకి స్వయంగా స్వాగతం పలికారు

ఇటలీ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ

రోమ్: 16వ జీ-20 సదస్సు నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటలీ చేరుకున్నారు. ఆయన ఇటలీ రాజధాని రోమ్‌కు శుక్రవారం మధ్యాహ్నం చేరుకున్నారు. ఇటలీ ప్రధానమంత్రి మరియో డ్రగి మోదీకి స్వయంగా స్వాగతం పలికారు. కాగా 30-31 రోజుల్లో జరిగే జీ-20 16వ సదస్సులో మోదీ పాల్గొననున్నారు. కాగా, ఈ సదస్సు అనంతరం వాటికన్‌లోని పోప్ ఫ్రాన్సిస్‌ని మోదీ కలవనున్నారు. ప్రధాని మోదీ పాల్గొనబోతున్న ఎనిమిదవ జీ-20 సదస్సు ఇది. గత ఏడాది జీ-20 సదస్సు సౌది అరేబియాలో జరిగింది. అయితే అప్పుడు కొవిడ్ కారణంగా వర్చువల్ ద్వారా సమావేశం నిర్వహించారు. జీ-20 సదస్సుకు మోదీ చివరిసారిగా హాజరైంది 2019లో ఒసాకాలో జరిగిన సదస్సుకు హాజరయ్యారు. అనంతరం రెండేళ్లకు ఇటలీలో జరగబోతున్న సమావేశంలో పాల్గొననున్నారు.

Updated Date - 2021-10-29T19:34:35+05:30 IST