కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ రికార్డ్

ABN , First Publish Date - 2020-08-14T13:09:23+05:30 IST

దేశంలో సుధీర్ఘకాలం పాటు పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ రికార్డు నెలకొల్పారు.

కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ రికార్డ్

సుధీర్ఘకాలం పనిచేసిన వైనం...నాలుగో స్థానం

న్యూఢిల్లీ :దేశంలో సుధీర్ఘకాలం పాటు పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ రికార్డు నెలకొల్పారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ మొట్టమొదటిసారి 2014 మే 26వతేదీన ప్రమాణస్వీకారం చేశారు. ప్రధానమంత్రిగా అటల్ బిహారి వాజ్ పేయి మొత్తం 2,268 రోజులు పనిచేశారు. దేశంలో వాజ్ పేయి కంటే సుధీర్ఘకాలం కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ పనిచేసి రికార్డు నెలకొల్పారు. ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వారిలో మోదీ నాల్గవ స్థానం పొందారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాక 1947 ఆగస్టు 15వతేదీన ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జవహర్ లాల్ నెహ్రూ 1964 మే 27వతేదీన మరణించే వరకు పనిచేశారు.నెహ్రూ 16 ఏళ్ల 286 రోజులు ప్రధానిగా సేవలందించారు. నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ 11 ఏళ్ల 59 రోజులు ప్రధానిగా మూడు సార్లు పనిచేసి ఎక్కువ కాలం పనిచేసిన రెండో ప్రధానిగా నిలిచారు. మన్‌మోహన్ సింగ్ 10 ఏళ్ల 4రోజుల ప్రధానిగా పనిచేసి దీర్ఘకాలం పాటు పనిచేసిన మూడో పీఎంగా నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరు ఏళ్ల 79 రోజుల పాటు పనిచేసి కాంగ్రెసేతర ప్రధానుల్లో ఎక్కువకాలం పనిచేసిన ప్రధానిగా రికార్డులకెక్కారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో ఎన్‌డీఏ విజయం అనంతరం మోదీ ప్రధాని అయ్యారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏకు 353 సీట్లు సాధించి రెండోసారి ప్రధాని పీఠాన్ని అధిష్ఠించారు. 

Updated Date - 2020-08-14T13:09:23+05:30 IST