గంగానదిలో మోదీ పవిత్ర స్నానం

ABN , First Publish Date - 2021-12-13T18:30:57+05:30 IST

కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు వారణాసి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ రెండ్రోజుల పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా తొలుత కాలభైరవ ఆలయంలో..

గంగానదిలో మోదీ పవిత్ర స్నానం

లక్నో: కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు వారణాసి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ రెండ్రోజుల పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా తొలుత కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాని ఆ వెంటనే జల మార్గం గుండా లలిత ఘాట్‌కు చేరుకుని గంగానదిలో పవిత్ర స్నానం చేశారు. అంతకు ముందు వారణాసి విమానాశ్రయం వద్ద ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. అక్కడి నుంచి కారులో బయలుదేరిన మోదీపై వారణాసి ప్రజలు గులాబీ పూలు జల్లుతూ, ''మోదీ మోదీ, హర్ హర్ మహదేవ్' నినాదాలు హోరెత్తించారు.


కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ 2019 మార్చి 8న శంకుస్థాపన చేశారు. కోవిడ్ మహమ్మారి వెంటాడినా నిర్దేశిత మూడేళ్ల కాలం లోపులో కారిడార్ ప్రాజెక్టును పూర్తి చేశారు. తాజా కారిడార్‌తో ఇప్పటి వరకూ ఇరుకైన వీధుల గుండా గంగా నదికి చేరుకుని స్నానానంతరం పవిత్ర నదీ జలాలను విశ్వనాథునికి సమర్పిస్తూ వస్తున్న భక్తులకు ఇక ఆ ఇబ్బందులు ఉండవు. విశ్వనాథుడి గుడికి దారితీసే వీధులన్నీ విశాలం చేశారు. ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కారిడార్‌ ప్రాజెక్టును రూ.339 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు.

Updated Date - 2021-12-13T18:30:57+05:30 IST