ఆక్సిజన్ కొరతపై మోదీ కీలక భేటీ

ABN , First Publish Date - 2021-04-16T21:16:51+05:30 IST

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. దీనిని

ఆక్సిజన్ కొరతపై మోదీ కీలక భేటీ

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘‘ దేశంలో తగినంత మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ సరఫరా ఉండేలా ప్రధాని మోదీ సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యం, రవాణా, ఉక్కు శాఖల నుంచి మోదీ ఇన్‌పుట్స్ కూడా తీసుకున్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉండేలా చూసుకోవాలని ప్రధాని నొక్కి చెప్పారు’’ అని ప్రధాని కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. దేశంలోని 12 రాష్ట్రాల్లో కరోనా తీవ్రంగా ఉందని, ఆ రాష్ట్రాల్లో రాబోయే 15 రోజుల్లో ఆక్సిజన్ సరఫరా గురించి కూడా మోదీ సమీక్షించారని పీఎంవో ఓ ప్రకటనలో పేర్కొంది. డిమాండ్‌కు అనుగుణంగా చికిత్స కోసం వినియోగించే ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని మోదీ అధికారులకు సూచించారు. అలాగే ప్రతి ప్లాంట్ సామర్థ్యాన్ని కూడా పెంచాలని సూచించారు. ఆక్సిజన్‌ను సరఫరా చేసే ట్యాంకర్లపై నిరంతర నిఘాను ఉంచాలని మోదీ సూచించారు. 

Updated Date - 2021-04-16T21:16:51+05:30 IST