‘ఉజ్వల’కే ఉచితం.. 95 శాతానికి అందని సాయం

ABN , First Publish Date - 2020-04-08T09:10:33+05:30 IST

కరోనా దెబ్బకు ఎంతో మంది పేదలు ఉపాధి కోల్పోయారు. వారిని ఆదుకోవడమే లక్ష్యంగా కేంద్రంమూడు నెలలు వంట గ్యాసు ఉచితం అంటూ ప్రకటించింది.

‘ఉజ్వల’కే ఉచితం.. 95 శాతానికి అందని సాయం

అమరావతి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): కరోనా దెబ్బకు ఎంతో మంది పేదలు ఉపాధి కోల్పోయారు. వారిని ఆదుకోవడమే లక్ష్యంగా కేంద్రంమూడు నెలలు వంట గ్యాసు ఉచితం అంటూ ప్రకటించింది. కానీ ‘పీఎం ఉజ్వల యోజన’ పథకం కింద కనెక్షన్‌ తీసుకొన్న వారికి మాత్రమే అంటూ ఉచితం మాటున ఓ షరతు విధించేసరికి రాష్ట్రంలోని 95ు మంది వినియోగదారులు కంగుతిన్నారు. ఆంధ్రలో సుమారుగా 1.60 కోట్ల వంట గ్యాసు కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో ఉజ్వల పథకం కింద ఉన్నవి 4 లక్షలు మాత్రమే.

Updated Date - 2020-04-08T09:10:33+05:30 IST