ఏప్రిల్‌లో కదలిక లేని పీఎంఐ

ABN , First Publish Date - 2021-05-04T06:37:30+05:30 IST

దేశంలో పారిశ్రామిక కార్యకలాపాలకు ప్రధాన సూచీ అయిన తయారీ రంగ పీఎంఐ ఏప్రిల్‌ నెలలో స్తబ్ధంగా ఉంది. ఎనిమిది నెలల కనిష్ఠ వృద్ధితో 55.5 పాయింట్లుగా నమోదైంది...

ఏప్రిల్‌లో కదలిక లేని పీఎంఐ

న్యూఢిల్లీ : దేశంలో పారిశ్రామిక కార్యకలాపాలకు ప్రధాన సూచీ అయిన తయారీ రంగ పీఎంఐ ఏప్రిల్‌ నెలలో స్తబ్ధంగా ఉంది. ఎనిమిది నెలల కనిష్ఠ వృద్ధితో 55.5 పాయింట్లుగా నమోదైంది. మార్చిలో ఇది 55.4 పాయింట్లు. అయినప్పటికీ వృద్ధికి, తిరోగమనానికి లక్ష్మణ రేఖ అయిన 50 పాయింట్ల కన్నా పైనే ఉండడం కాస్తంత ఊరటనిచ్చే అంశం. ఏప్రిల్‌లో యంత్రపరికరాలు, ముడి పదార్థాలకు కొత్త ఆర్డర్లు తగ్గడం ఈ స్తబ్ధతకు కారణం. 

Updated Date - 2021-05-04T06:37:30+05:30 IST