Abn logo
Mar 5 2021 @ 18:14PM

ప్రారంభమైన శ్రీ ముత్యాల పోచమ్మ ఉత్సవాలు

 నిర్మల్: జిల్లాలోని శ్రీ ముత్యాల పోచమ్మ ఆలయంలో ఘనంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఖానాపూర్ పట్టణంలో శ్రీ ముత్యాల పోచమ్మ అమ్మవారు కొలువై ఉన్నారు. ఉత్సవాలలో భాగంగా ఆలయంలో 300 మంది మహిళలతో కుంకుమార్చన నిర్వహించారు. మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగనున్నాయి. ఉత్సవాలకు  భారీగా భక్తులు తరలి వచ్చారు.