Advertisement
Advertisement
Abn logo
Advertisement

దోమకొండ కోటలో పోచమ్మ పండుగ

దోమకొండ, డిసెంబరు 5: మండల కేంద్రంలోని గడికోట లో ఆదివారం కామినేని వంశస్తులైన అనిల్‌ కుమార్‌, శోభనలు కుటుంబ సభ్యులతో హాజరై పోచమ్మ పండుగను నిర్వహించి బోనాలు సమర్పించారు. కోటలో హీరో రాం చరణ్‌ సతీమణి ఉపాసన చెల్లెలు కామినేని అనుష్పల వివాహం సందర్భంగా పోచమ్మ పండుగను నిర్వహించా రు. హెలిప్యాడ్‌లో అపోలో హాస్పిటల్స్‌ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. దోమకొండ మహిళలకు అనంద్‌ భవన్‌లో కామినేని శోభన చీర లను పంపిణీ చేశారు. అనంతరం అమె మాట్లాడుతూ ఈ నెల 8న అనుష్పల వివాహం హైదరాబాద్‌లో జరుగనుందన్నారు. ఆనవాయితీ ప్రకారం పెళ్లికి ముందు పోచమ్మ పం డుగను నిర్వహించి, బోనాలను సమర్పించామన్నారు. పోచ మ్మ పండుగకు హాజరై తమ కూతురికి అశీస్సులు అందిం చినందుకు మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. దోమకొం డకు కొత్త అల్లుడు వస్తున్నాడని గ్రామస్థులతో సంతోషం వ్యక్తం చేశారు. రాత్రి నిర్వహించే కార్యక్రమానికి హీరో రాం చరణ్‌, అతని భార్య ఉపాసన, అనుష్పలకు కాబోయే భర్త హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సుమారు 200కు పైగా వాహనాల్లో కామినేని వంశస్తుల బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. కోటలో హైదారాబాద్‌ నుంచి వచ్చిన కళా కారులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పా టు చేశారు. ఈ కార్యక్రమానికి కోట సీనియర్‌ మేనేజర్‌ బాబ్జి పూర్తి ఏర్పాట్లు చేశారు. కాగా డీఎస్పీ సోమనాథం, సీఐ అభిలాష్‌, ఎస్సై సుధాకర్‌ల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహి ంచారు.

Advertisement
Advertisement