అతిపెద్ద బ్యాటరీ, 64 ఎంపీ కెమెరా.. వచ్చేసిన ‘పోకో ఎక్స్3’

ABN , First Publish Date - 2020-09-22T23:02:11+05:30 IST

భారత మార్కెట్లోకి మరో ఫోన్ వచ్చేసింది. ‘పోకో ఎక్స్2’కు సక్సెసర్‌గా తీసుకొచ్చిన ‘పోకో ఎక్స్3’ని వర్చువల్ ఈవెంట్‌ ద్వారా కంపెనీ

అతిపెద్ద బ్యాటరీ, 64 ఎంపీ కెమెరా.. వచ్చేసిన ‘పోకో ఎక్స్3’

న్యూఢిల్లీ: భారత మార్కెట్లోకి మరో ఫోన్ వచ్చేసింది. ‘పోకో ఎక్స్2’కు సక్సెసర్‌గా తీసుకొచ్చిన ‘పోకో ఎక్స్3’ని వర్చువల్ ఈవెంట్‌ ద్వారా కంపెనీ విడుదల చేసింది. ఇందులో మూడు ర్యామ్ ఆప్షన్లు, రెండు కలర్ వేరియంట్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయానికి రానుంది.


పోకో ఎక్స్3 6జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ. 16,999 కాగా, 6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ. 18,499 మాత్రమే. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8జీబీ ర్యామ్+128 స్టోరేజీ వేరియంట్ ధర రూ. 19,999. ఈ నెల 29న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ప్రారంభం కానుంది. 


పోకో ఎక్స్ 3 స్పెసిఫికేషన్లు: డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 10 ఓఎస్, 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 732జి చిప్‌సెట్, 64 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు నాలుగు కెమెరాలు, ముందువైపు 20 ఎంపీ కెమెరా, మైక్రోఎస్డీకార్డు ద్వారా మెమొరీ పెంచుకునే వెసులుబాటు, 6000 ఎంఏహెచ్ సామర్థ్యంతో అతిపెద్ద బ్యాటరీ, 33W ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి. 

Updated Date - 2020-09-22T23:02:11+05:30 IST