Abn logo
Mar 6 2021 @ 15:08PM

పోడు రైతు ఆత్మహత్యాయత్నం

మహబూబాబాద్: అటవీ అధికారుల అత్యుత్సాహం కారణంగా ఓ పోడు రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో జిల్లాలోని గూడూరు మండలంలోగల లైన్ తండాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లైన్ తండాలో కొంతమంది రైతులు పోడు వ్యవసాయం చేస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు అటవీశాఖ అధికారులు తండాకు వెళ్లారు. దీంతో అటవీశాఖ అధికారులు, పోడు రైతుల మధ్య వాగ్వివాదం జరిగింది.


అధికారుల తీరుకు నిరసనగా ఓ పోడు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోడు రైతు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోడు భూముల జోలికి వెళ్లవద్దని అటవీశాఖ అధికారులను మంత్రులు గతంలోనే ఆదేశించారు. అయితే మంత్రుల ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదు.