డ్రోన్‌ టెక్నాలజీని ప్రోత్సహించాలి

ABN , First Publish Date - 2021-05-18T06:16:52+05:30 IST

వ్యవసాయ రంగంలో డ్రోన్‌ టెక్నాలజీని ప్రోత్సహించాలని పొగాకుబోర్డు చైర్మన్‌ యడ్లపాటి రఘునాథబాబు తెలిపారు.

డ్రోన్‌ టెక్నాలజీని ప్రోత్సహించాలి
డ్రోన్‌తో పురుగుమందు స్ర్పేయింగ్‌ను పరిశీలిస్తున్న ఛైర్మన్‌ యడ్లపాటి

పొగాకు బోర్డు చైర్మన్‌ యడ్లపాటి 

గుంటూరు, మే 17 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగంలో డ్రోన్‌ టెక్నాలజీని ప్రోత్సహించాలని పొగాకుబోర్డు చైర్మన్‌ యడ్లపాటి రఘునాథబాబు తెలిపారు. పురుగు మందుల పిచికారిలో డ్రోన్ల వినియోగంపై ఢిల్లీ నుంచి కేంద్ర వ్యవసాయశాఖ, రైతుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో సోమవారం  వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గుంటూరు  నుంచి పొగాకుబోర్డు నుంచి చైర్మన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం, ఐటీసీ సాంకేతిక విభాగం డ్రోన్‌ టెక్నాలజీని ఉపయోగించి మెరుగైన ఫలితాలు సాధించినట్లు చెప్పారు. డ్రోన్ల వల్ల పురుగుమందు, నీటి వినియోగం, కూలీల ఖర్చు తగ్గుతుందన్నారు. పర్యావరణానికి మేలు జరుగుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రోన్లకు సబ్సిడీలు ఇచ్చి మెకనైజేషన్‌లో దీనిని చేర్చాలన్నారు.  


Updated Date - 2021-05-18T06:16:52+05:30 IST