Oct 14 2021 @ 22:43PM

మర్డర్‌ మిస్టరీ ‘పాయిజన్‌’

రమణ, షఫీ, కమల్‌, అమిత్‌ విక్రమ్‌ కీలక పాత్రధారులుగా సి.యల్‌.యన్‌ మీడియా సంస్థ నిర్మించిన చిత్రం ‘పాయిజన్‌’. రవిచంద్రన్‌ దర్శకత్వంలో శిల్పిక.కె నిర్మించిన ఈ చిత్రం మోష్‌ పోస్టర్‌ను సి.కల్యాణ్‌ ఆవిష్కరించారు. అనంతరం చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపి సినిమా సక్సెస్‌ కావాలని ఆకాంక్షించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘మర్డర్‌ మిస్టరీ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన సినిమా  ఇది. షఫీ ఏ.సి.పిగా బలమైన పాత్ర పోషించారు’’ అని అన్నారు.