Advertisement
Advertisement
Abn logo
Advertisement

పేకాట దుమారం - కేసులు కట్టకుండా వసూళ్లు?

యాడికి, నవంబరు 28: పేకాటరాయుళ్లతో పోలీసుల అక్రమ వసూళ్ల వ్యవహారంపై మండలంలో చర్చనీయాంశమైంది. పేకాట ఆడుతూ పట్టుబ డిన వారిపై కేసు నమోదు చేయకుండా కొందరు పోలీసులు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో శనివా రం రాత్రి డీఎస్పీ చైతన్య పోలీ్‌సస్టేషనలో విచారణ చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు, వారం రోజుల క్రితం యాడికి గ్రామానికి చెందిన కొం దరు వెంకటాంపల్లి సమీప కొండల్లో పేకాట ఆడుతుండగా ఎస్‌ఐ రాంభూపాల్‌ సిబ్బందితో కలిసి దాడిచేశారు. ఘటనలో పేకాటరాయుళ్లంతా పారిపోయారు. అక్కడే వదిలేసి పోయిన సెల్‌ఫోన్లు పోలీసులు తీసుకొని వివరా లు ఆరాతీశారు. ఆ తర్వాత మధ్యవర్తి ద్వారా వారి నుంచి రూ.70 వేలు అ క్రమ వసూలుకు ప్రయత్నాలు జరిపారని తెలిసింది. పేకాటకు వచ్చిన బీ మునిపల్లి, కుమ్మెత, యాడికికి చెందిన వారి నుంచి రూ.30వేలు వసూలు చేశారని, మిగిలిన మొత్తం వసూలు చేసే పనిలో ఉండగానే విషయం డీ ఎస్పీకి చేరింది. దీంతో యాడికి పోలీ్‌సస్టేషనకు వచ్చిన ఆయన మధ్యవర్తిని, పేకాటరాయుళ్లను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. 


కాగా పేకాటరాయుళ్లపై కేసు నమోదు కోసం మధ్యవర్తి ద్వారా పేకాటరాయుళ్లను సీఐ కార్యాలయానికి పిలిపించారు. ఈ సమయంలో మధ్యవర్తి పేకాట ఆడిన వారిని కాకుండా అమాయకులని సీఐ వద్దకు పంపారు. వా రికి సీఐ కౌన్సెలింగ్‌ ఇవ్వగా మాకేమి తెలియదని, మధ్యవర్తి స్టేషన వద్దకు పోయి సంతకం పెట్టి రమ్మంటే వచ్చామని చెప్పడంతో బండారం బయటపడింది. యాడికి పోలీ్‌సస్టేషనకు వచ్చిన డీఎస్పీ చైతన్య మధ్యవర్తిని పోలీస్‌స్టేషనకు పిలిపించి తీవ్రంగా మందలించినట్లు సమాచారం. అక్రమంగా వసూలుకు పాల్పడాలని ప్రయత్నించిన పోలీసు సిబ్బందిని తీవ్రంగా హెచ్చరించినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈఅంశంపై తాడిపత్రి డీఎస్పీ చైతన్యను వివరణ కోరగా, గ్యాంబ్లింగ్‌ ఆడిన వారి నుంచి డబ్బు వసూలుకు పాల్పడినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై విచారణ చేయాలని సీఐని ఆదేశించామని, ఇంకా విచారణ జరుగుతోందని డీఎస్పీ తెలిపారు.


Advertisement
Advertisement