Abn logo
Aug 4 2021 @ 04:00AM

అనిత హ్యాట్రిక్‌ గోల్డ్‌

మహిళల హ్యామర్‌ త్రోలో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన వ్లోడార్జిక్‌ అనిత (పోలెండ్‌) అంచనాలకు తగ్గట్టే ఈ విభాగంలో స్వర్ణం ఎగరేసుకుపోయింది. వాంగ్‌ ఝింగ్‌ (చైనా) రజతం, కొప్రోన్‌ మాల్వినా (పోలెండ్‌) కాంస్యాలను దక్కించుకున్నారు. తాజా పతకంతో వరుసగా మూడు ఒలింపిక్స్‌ల్లో హ్యామర్‌ త్రోలో పసిడి పతకాలు సాధించిన ఏకైక అథ్లెట్‌గా అనిత సరికొత్త రికార్డును సొంతం చేసుకొంది.