పోలవరంలో అవినీతి జరిగింది: ఎమ్మెల్సీ మాధవ్

ABN , First Publish Date - 2020-10-25T15:18:24+05:30 IST

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని బీజేపీ నేత, ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యానించారు. విజయదశమి సందర్భంగా ఆదివారం నాడు ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన..

పోలవరంలో అవినీతి జరిగింది: ఎమ్మెల్సీ మాధవ్

విజయవాడ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని బీజేపీ నేత, ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యానించారు. విజయదశమి సందర్భంగా ఆదివారం నాడు ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం అంచనాల పెంపుపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఇదే విషయమై గతంలో గడ్కరీకి  కూడా తాము ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. వాస్తవ అంచనాలకు అనుగుణంగా కేంద్రం నిధులు ఇస్తుందని మాధవ్ పేర్కొన్నారు. సాంకేతికత పేరుతో పోలవరం అంచనాలను అమాంతం పెంచేశారని ఆయన ఆరోపించారు. ఇదే సమయంలో గీతం యూనివర్సిటీ ఘటనపైనా స్పందించారు. గీతం యూనివర్సిటీ విషయంలో అనుసరించిన విధానాన్ని అన్ని అక్రమ కట్టడాల విషయంలోనూ అనుసరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూల్చివేతలపై ఒకే పాలసి ఉండాలన్నారు. ప్రతిపక్షంపై కక్ష సాధింపు చర్యలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడినట్లుగా కనిపిస్తోందని మాధవ్ వ్యాఖ్యానించారు. ప్రజా వేదిక తరువాత ఏ అక్రమ కట్టడాలు కూల్చారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

Updated Date - 2020-10-25T15:18:24+05:30 IST