Abn logo
Jun 15 2021 @ 01:48AM

ఎట్టకేలకు స్తంభాల తొలగింపు

తాళ్లూరు, జూన్‌ 14 : తాళ్లూరు గ్రామంలో నాలుగేళ్లుగా రోడ్డులో ఉన్న విద్యుత్తు స్తంభాల సమస్యను అధికారులు తొలగించి పరిష్కరించారు. ‘విద్యుత్తు స్తంభాల తొలగింపు ఎన్నడో’? అన్న కఽథనంతో మే నెల 8న తాళ్లూరు గ్రామ ప్రధాన వీధి ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను ఆంధ్రజ్యోతి ప్రచురించింది. దీనిపై స్పందించిన స్థానిక అధికార పార్టీ నేతలు ఐ.వేణుగోపాల్‌రెడ్డి, మారం వెంకటరెడ్డి, ఐ.వెంకటేశ్వరరెడ్డి, లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్‌ మేకల చార్లెస్‌ సర్జన్‌లు వైసీపీ మండల ఇన్‌చార్జి మద్దిశెట్టి రవీంద్ర దృష్టికి సమస్యతీసును ఉ వెళ్లారు. రవీంద్ర ఈ విషయాన్ని శాసనసభ్యులు మద్దిశెట్టి  వేణుగోపాల్‌తో చర్చించి ఆశాఖ అధికారులకు విద్యుత్తు స్తంభాలను తొలగించాలని సూచించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్తు స్తంభాలను తొలగించారు.