Abn logo
Jan 14 2021 @ 15:13PM

అఖిలప్రియను జడ్జి ఎదుట హాజరుపర్చిన పోలీసులు

హైదరాబాద్‌: మాజీమంత్రి అఖిలప్రియను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపర్చారు. కోర్టు సెలవు కారణంగా న్యాయమూర్తి నివాసంలో ఆమెను హాజరుపర్చారు. 3 రోజుల విచారణ స్టేట్‌మెంట్‌ను న్యాయమూర్తికి పోలీసులు ఇచ్చారు. అనంతరం చంచల్‌గూడ మహిళ జైలుకు తరలించనున్నారు. బేగంపేట మహిళా పీఎస్‌లో 3 రోజులు అఖిలప్రియను పోలీసులు ప్రశ్నించారు. అంతకుముందు ఉదయం అఖిల ప్రియకు బేగంపేట్ పాటిగడ్డ హెల్త్ కేర్ సెంటర్‌లో కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమెకు నెగెటివ్‌గా తేలింది. అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈసీజీ, చెస్ట్ ఎక్స్‌రే, గైనకాలజి డిపార్ట్‌మెంట్‌లో పరీక్షలు నిర్వహించారు. న్యూరాలజీ వైద్యులు పరీక్షలు జరిపారు. 

Advertisement
Advertisement
Advertisement