గోదావరి ముంపుపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ABN , First Publish Date - 2021-06-24T04:57:24+05:30 IST

కుక్కునూరు మండలంలో ఎస్పీ బుధవారం పర్యటించి గోదావరి వరద ముంపు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.

గోదావరి ముంపుపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
సిబ్బందికి సూచనలిస్తున్న ఎస్పీ

కుక్కునూరు, జూన్‌ 23: కుక్కునూరు మండలంలో ఎస్పీ బుధవారం పర్యటించి గోదావరి వరద ముంపు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. గత ఏడాది వరదలకు నీట మునిగిన ప్రాంతాల వివరాలు తెలుసుకున్నారు. భద్రాచలం వద్ద నీటి మట్టం ప్రకారం కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఏ గ్రామాలు ప్రభావితం అవుతాయో పూర్తి సమాచారం తీసుకోవాలన్నారు. అనంతరం ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో కిన్నెరసాని వాగు వద్దకు వెళ్లా రు. గోదావరి వరదతో ఆ ప్రాంతాల్లో ఎక్కడ వరకు ప్రభావితం అవుతుందో తెలంగాణ పోలీసు సిబ్బందితో చర్చించారు. గోదావరి వరదలపై అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచనలు ఇచ్చారు. కుక్కు నూరు సీఐ దుర్గాప్రసాద్‌, వేలేరుపాడు ఎస్‌ఐ రమేష్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు ఎస్‌ఐ జితేందర్‌, ఖాజా పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T04:57:24+05:30 IST