హైదరాబాద్‌‌లో డేటింగ్‌ యాప్‌ పేరుతో ఘరానా మోసం

ABN , First Publish Date - 2020-10-14T00:46:37+05:30 IST

భాగ్యనగరంలో డేటింగ్‌ యాప్‌ పేరుతో ఘరానా మోసాలకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది.

హైదరాబాద్‌‌లో డేటింగ్‌ యాప్‌ పేరుతో ఘరానా మోసం

హైదరాబాద్‌ : భాగ్యనగరంలో డేటింగ్‌ యాప్‌ పేరుతో ఘరానా మోసాలకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది. అనందకర్‌, బుద్దపాల్‌ అనే ఇద్దరు డేటింగ్ యాప్ పేరుతో మోసాలు చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని ఇవాళ హైదరాబాద్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. డేటింగ్‌ యాప్‌ పేరుతో 16 మంది యువతులతో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారని.. ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో కోల్‌కతాలో ఉన్న కాల్‌ సెంటర్‌పై దాడిచేసి అరెస్ట్ చేశామని పోలీసులు మీడియాకు వెల్లడించారు.


ఆ 16 మంది యువతులకు 41 సీఆర్పీ కింద నోటీసులు కూడా జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా ఈ ముఠా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. దాడుల్లో భాగంగా రెండు ల్యాప్‌టాప్స్‌, 24 ఫోన్లు, 51 సిమ్‌ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2020-10-14T00:46:37+05:30 IST