మధ్యప్రదేశ్‌లో ఆయుధాల అక్రమ రవాణా గుట్టురట్టు.. కబడ్డీ జాతీయస్థాయి ఆటగాడు సహా నలుగురికి అరందండాలు

ABN , First Publish Date - 2021-10-21T21:19:46+05:30 IST

ఆయుధాలను అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో

మధ్యప్రదేశ్‌లో ఆయుధాల అక్రమ రవాణా గుట్టురట్టు.. కబడ్డీ జాతీయస్థాయి ఆటగాడు సహా నలుగురికి అరందండాలు

భోపాల్: ఆయుధాలను అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు జాతీయస్థాయి కబడ్డీ ఆటగాడని పోలీసులు తెలిపారు. శివపురిలోని తమ క్లయింట్‌కు ఆయుధాలను ఇచ్చేందుకు తీసుకెళ్తుండగా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఐదు లోడెడ్ పిస్టళ్లు, మూడు మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కబడ్డీ ఆటగాడిని రింకు జాట్‌గా గుర్తించారు. 


హర్యానాకు చెందిన రింకు ప్రొఫెషనల్ కబడ్డీ లీగుల్లో ఆడుతుంటాడని, జాతీయ స్థాయి ఆటగాడని పోలీసులు తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు అతడు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. మిగతా ముగ్గురిని రాంపాల్ జాట్, ఆమిర్ ఖాన్, మహేంద్ర రావత్‌గా గుర్తించారు. 


వీరు నలుగురు ముఠాగా ఏర్పడి ఆయుధాల అక్రమ రవాణా చేస్తున్నట్టు తెలిపారు. వీరు క్రెటా కారులో ఆయుధాలను తీసుకుని వెళ్తున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో దాడి చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకులు మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో తయారైనట్టు గుర్తించారు. దీంతో పోలీసు బృందం ఒకటి అక్కడికి వెళ్లింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-21T21:19:46+05:30 IST