తెల్లారితే పెళ్లనగా ఓ వధువు చేసిన నిర్వాకం.. రాత్రికి రాత్రే ఇంట్లోంచి ఎస్కేప్.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్..!

ABN , First Publish Date - 2021-12-10T21:29:53+05:30 IST

అతనికి మధ్యవర్తుల ద్వారా పెళ్లి సంబంధం కుదిరింది.. భారీగా డబ్బు చెల్లించి మరీ పెళ్లి కుదుర్చుకున్నాడు..

తెల్లారితే పెళ్లనగా ఓ వధువు చేసిన నిర్వాకం.. రాత్రికి రాత్రే ఇంట్లోంచి ఎస్కేప్.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్..!

అతనికి మధ్యవర్తుల ద్వారా పెళ్లి సంబంధం కుదిరింది.. భారీగా డబ్బు చెల్లించి మరీ పెళ్లి కుదుర్చుకున్నాడు.. పెళ్లికి రెండ్రోజుల ముందే వధువు.. వరుడి ఇంటికి చేరుకుంది.. తెల్లారితే పెళ్లనగా ఆమె ఆ ఇంటి నుంచి మాయమైంది.. ఇంట్లోని నగదు, డబ్బు కూడా పోయింది.. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.. మధ్యవర్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు వధువును పట్టుకున్నారు.. రాజస్థాన్‌లోని జైపూర్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. 


జైపూర్‌కు సమీపంలోని బగ్రూ గ్రామానికి చెందిన రాజేష్ కుమార్‌.. గణేష్ నారాయణ్ అనే మధ్యవర్తిని పెళ్లి సంబంధం కోసం ఆశ్రయించాడు. అతను మహారాష్ట్ర సరిహద్దు గ్రామానికి చెందిన విక్కీ శర్మ అనే మరో మధ్యవర్తిని సంప్రదించాడు. ఇద్దరూ కలిసి దీపాళి అనే అమ్మాయితో రాజేష్‌కు వివాహం నిశ్చయించారు. వివాహానికి రెండ్రోజుల ముందే దీపాళిని, ఆమె సోదరుడిని రాజేష్ కుటుంటానికి అప్పగించి తమ కమిషన్‌గా రూ.1.80 లక్షలు తీసుకున్నారు. దీంతో రాజేష్ కుటుంబం పెళ్లి ఏర్పాట్లు చేసుకుంది. 


తెల్లారితే పెళ్లనగా ఇంట్లోని నగలు, బంగారం తీసుకుని దీపాళి, ఆమె సోదరుడు అక్కణ్నుంచి పరారయ్యారు. దీంతో రాజేష్ స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మధ్యవర్తి గణేష్ నారాయణ్‌ని అరెస్ట్ చేశారు. దాదాపు ఐదు నెలల పాటు దర్యాఫ్తు సాగించి ఎట్టకేలకు గురువారం దీపాళిని, ఆమె సోదరుడిని అరెస్ట్ చేశారు. 

Updated Date - 2021-12-10T21:29:53+05:30 IST