Abn logo
May 7 2021 @ 00:00AM

కొవిడ్‌ బాధితుల కోసం పోలీసు సహాయ కేంద్రం

పోలీసు సహాయ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఓఎస్డీ హర్షవర్ధన్‌ శ్రీవాత్సవ్‌

ఆదిలాబాద్‌టౌన్‌, మే7: జిల్లాలో రోజు రోజుకూ కరోనా కేసుల ఉధృతిని దృష్టిలో ఉంచుకొని బాధిత కుటుంబ సభ్యులకు సమగ్ర సమాచారం అందించేం దుకు జిల్లా పోలీసులు సహాయం చేయనున్నట్లు జిల్లా ఓఎస్డీ హర్షవర్ధన్‌ శ్రీవాత్సవ్‌ తెలిపారు. రిమ్స్‌లో ఏర్పాటు చేసిన పోలీసు కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓఎస్డీ మాట్లాడుతూ   కరోనా బాధితుల అవసరాల కోసం సమగ్రమైన సమాచారంతో హెల్ప్‌లైన్‌ 24/7 పని చేస్తుందన్నారు. సెంటర్‌లో ఆక్సిజన్‌, ఐసీయూ, పడకల ఖాళీల వివరాలు, అంబులెన్స్‌, ఔషధాలు, డాక్టర్ల వివరాలు తదితర కరోనా బాధితులకు అత్యవసరంగా అందించే సేవలను గుర్తించి ఆ సమాచారాన్ని అందిస్తామని తెలిపారు. ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఇద్దరు ఏఎస్సైలు, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఓ మహిళా కానిస్టేబుల్‌ ఈ సెంటర్‌లో విధులు నిర్వహించేందుకు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో అదనపు ఎస్పీ వినోద్‌కుమార్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Advertisement