పోలీసులపై దాడి కేసులో తొమ్మిది మంది అరెస్టు

ABN , First Publish Date - 2020-10-19T05:49:49+05:30 IST

పోలీసులపై దాడి చేసి మద్యంతో సహా పరారైన తొమ్మిది మందిని అరెస్టు చేశామని అమలాపురం డీఎస్పీ షేక్‌ మసూమ్‌బాషా చెప్పారు. కాట్రేనికోన పోలీస్‌ స్టేషన్‌లో పల్లం అక్రమ మద్యం కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

పోలీసులపై దాడి కేసులో తొమ్మిది మంది అరెస్టు
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న అమలాపురం డీఎస్పీ మాసూం బాషా

కాట్రేనికోన, అక్టోబరు 18: పోలీసులపై దాడి చేసి మద్యంతో సహా పరారైన  తొమ్మిది మందిని  అరెస్టు చేశామని అమలాపురం డీఎస్పీ షేక్‌ మసూమ్‌బాషా చెప్పారు. కాట్రేనికోన పోలీస్‌ స్టేషన్‌లో పల్లం అక్రమ మద్యం కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ నెల 16న నీలరేవు వంతెన వద్ద  మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఓ పడవను పోలీసులు గుర్తించారు. నిందితులను పట్టుకుని ఫొటోలు తీస్తున్న సమయంలో పోలీసులపై దాడి  చేసి పడవతో సహా పరారయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కాలాడి వెంకటేశ్వర్లు, మల్లాడి ఆదినారాయణదాసు, పాలెపు ధనకుమార్‌, పాలెపు వెంకట్రావు, సంగాని శ్రీను, చింతా నూకరాజు, చింతా సత్యనారాయణ, కాలాడి సూర్యచంద్రరాజు, చింతా బాలరాజును అరెస్టు  చేశారు. రూ.39,700లు విలువైన మద్యం బాటిళ్లను, ఒక పడవను, పోలీసుల  నుంచి లాక్కున్న మొబైల్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరి మీద  రౌడీ షీట్లు తెరుస్తామని డీఎస్పీ వివరించారు.  ముమ్మిడివరం సీఐ జానకీరామ్‌, స్థానిక ఎస్సై షేక్‌ జబీర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-19T05:49:49+05:30 IST