మహిళా రైతులపై పోలీసుల దాడి హేయం

ABN , First Publish Date - 2021-04-11T08:01:30+05:30 IST

కొమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికలపేట్‌ మండలం కొండపెల్లిలో పేద రైతుల కోసం బీజేపీ నేతలు చేస్తున్న దీక్షను అర్ధరాత్రి బలవంతంగా భగ్నం చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఖండించారు.

మహిళా రైతులపై పోలీసుల దాడి హేయం

దాడిలో బీజేపీ నేత పక్కటెముకలు విరిగాయి: బండి సంజయ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): కొమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికలపేట్‌ మండలం కొండపెల్లిలో పేద రైతుల కోసం బీజేపీ నేతలు చేస్తున్న దీక్షను అర్ధరాత్రి బలవంతంగా భగ్నం చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఖండించారు. ‘‘అమాయకపు పేద మహిళా రైతులపై పోలీసులు దాడి చేయడం హేయమైన చర్య. అర్ధరాత్రి దీక్ష శిబిరంపై పోలీసులు చేసిన ఆకస్మిక దాడిలో బీజేపీ నాయకులు పాల్వాయి హరీశ్‌ పక్కటెముకలు విరిగాయి. మరో బీజేపీ నేత సత్యనారాయణకూ తీవ్ర గాయాలయ్యా యి. హైదరాబాద్‌ చుట్టూ పక్కల టీఆర్‌ఎస్‌ నేతలు కోట్ల విలువైన భూముల్ని కబ్జా చేసినా ప్రభుత్వం పట్టించుకోదు. కానీ ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న పేద రైతులపై ప్రతాపం చూపిస్తారా?’’ అని ఆయన మండిపడ్డారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న తమ భూముల్ని లాక్కోవద్దంటే పోలీసులతో కొట్టిస్తారా అని ఎంపీ సోయం బాపురావు నిలదీశారు. సమస్యను పరిష్కరించాలని తాను ఎన్నోసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశానని చెప్పారు. 

Updated Date - 2021-04-11T08:01:30+05:30 IST