బరులపై పోలీసుల దాడులు.. పలువురి అరెస్టు

ABN , First Publish Date - 2022-01-17T06:47:50+05:30 IST

తణుకు సర్కిల్‌ పరిధిలో వివిధ ప్రాంతాల్లో పేకాడు తున్న వారిపై దాడి చేసి 52 మందిని అరెస్టు చేసినట్టు సీఐ సీహెచ్‌. ఆంజనే యులు చెప్పారు.

బరులపై పోలీసుల దాడులు.. పలువురి అరెస్టు
తణుకు సర్కిల్‌ పరిధిలో పోలీసులు స్వాధీనం చేసుకున్న మోటారు సైకిళ్లు

తణుకు, జనవరి 16 : తణుకు సర్కిల్‌ పరిధిలో వివిధ ప్రాంతాల్లో పేకాడు తున్న వారిపై దాడి చేసి 52 మందిని అరెస్టు చేసినట్టు సీఐ  సీహెచ్‌. ఆంజనే యులు చెప్పారు. భోగినాడు  బైపాస్‌ రోడ్డులో నిర్వహించిన కోడి పందేల బరి లో పేకాడుతున్న  30 మందిని అరెస్టు చేసి, 57 మోటారు సైకిళ్ళు, రూ. 3.04 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆదివారం రెండు ప్రాంతాల్లో  పేకాట ఆడుతున్న 22 మందిని అరెస్టు చేసి రూ. 3.05 లక్షలు స్వాధీనం చేసుకున్నా మని పట్టణ ఎస్‌ఐ కె.గంగాధర్‌ తెలిపారు.

ఇరగవరం: మండలంలో పేకాట, గుండాట, కోడి పందేలు నిర్వహి స్తున్న 22 మందిపై కేసులు నమోదు చేసినట్టు ఎస్‌ఐ జానా సతీష్‌ తెలిపారు. ఈ దాడిలో రూ. 10,686 నగదు, 3 కోళ్ళను స్వాధీనం చేసుకున్నారు. ఇరగవ రంలో పేకాట ఆడుతున్న 14 మందిని అదుపులోకి తీసుకుని, రూ.6,830, 11 ద్విచక్ర వాహనాలను స్వాఽధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

నిడదవోలు:  కోడిపందేలు, పేకాట, గుండాటలపై ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. నిడదవోలు రైల్వేగేటు సెంటరు, తిమ్మరాజుపాలెం రోడ్డు, శింగవరంలో 3 కేసులు నమోదు చేసి రూ.4480 నగదు, మూడు కోళ్ళు, ఆరు కత్తులు, 9 మంది జూదరులను అరెస్టు చేశారు. తిమ్మరాజుపాలెంలో పేకాడుతున్న ఐదుగురిని అరెస్టు చేసి వారి  నుంచి రూ.2050 నగదు, శింగవరంలో గుండాట ఆడుతున్న ఆరుగురు నింది తులను అరెస్టు చేసి రూ.2350 నగదు, సమిశ్రగూడెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తాడిమళ్ళ, కాటకూటేశ్వరం, కోరుమామిడి, డి.ముప్పవరం గ్రామాల్లో కోడిపం దేలు నిర్వహిస్తున్న 8 మందిని అరెస్టు చేసి 4 కత్తులు, 4 కోళ్ళు, రూ. 4210ల నగదు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్టు నిడదవోలు, సమిశ్రగూడెం ఎస్‌ఐలు పి.నాగరాజు, షేక్‌ సుబాని తెలిపారు. 

తాడేపల్లిగూడెం రూరల్‌: తాడేపల్లిగూడెం పట్టణంలోని దర్శిపర్రు రోడ్డు వెంబడి ఉన్న పొలాల్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పట్టణ పోలీసులు దాడిచేసి 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి రూ. 1.42 లక్షల నగదు, 14 మోటారు సైకిల్‌ళ్లు, 7 సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ ఆకుల రఘు తెలిపారు. దాడుల్లో ఎస్‌ఐ జీజే ప్రసాద్‌, బి. రాజు పాల్గొన్నట్టు చెప్పారు.

పెంటపాడు: మండలంలో పండుగ మూడు రోజులు  కోడిపందేలు, పేకాట, గుండాటలు అడుతున్న 34 మందిని అరెస్టు చేసి వీరి నుండి రూ 29,100 నగదు, 6 కోళ్ళు, 6 కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు పెంటపాడు  ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపారు.

Updated Date - 2022-01-17T06:47:50+05:30 IST