కొరడా ఝుళిపిస్తున్న పోలీసులు

ABN , First Publish Date - 2021-05-08T05:17:58+05:30 IST

కర్ఫ్యూ నిబంధనలు అధిగమించిన వారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. తొలి రెండు రోజులు కౌన్సెలింగ్‌తో సరి పెట్టిన పోలీసులు మూడో రోజు నుంచి తీవ్రంగా పరిగణిస్తున్నారు.

కొరడా ఝుళిపిస్తున్న పోలీసులు
అక్కయ్యపాలెం మహారాణిపార్లర్‌ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు

కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు

సరైన కారణం లేకుంటే కేసుల నమోదు

విశాఖపట్నం, మే 7 : కర్ఫ్యూ నిబంధనలు అధిగమించిన వారిపై పోలీసులు కొరడా  ఝుళిపిస్తున్నారు. తొలి రెండు రోజులు కౌన్సెలింగ్‌తో సరి పెట్టిన పోలీసులు మూడో రోజు నుంచి తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీతమ్మధార కూడలిలోని పోలీస్‌ సబ్‌స్టేషన్‌ వద్ద శుక్రవారం పన్నెండు గంటలు దాటిన తర్వాత రోడ్డుపై కనిపించిన వాహన చోదకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన కారణం తెలిపి గుర్తింపు కార్డు లు ఉన్న వారిని వదిలిపెట్టారు.


కారణం లేకుండా తిరుగుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. కర్ఫ్యూ సమయంలో సరైన కారణం లేకుండా రోడ్డుపై కనిపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ద్వారకా పోలీసు స్టేషన్‌, నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌ సీఐలు గొలగాని అప్పారావు, ప్రేమ్‌కుమార్‌లు హెచ్చరించారు. అలాగే, మహారాణిపార్లర్‌, సంగం ఆఫీస్‌ జంక్షన్‌ తదితర ప్రాతాల్లో నాల్గో పట్టణ సీఐ ప్రేమ్‌కుమార్‌ సిబ్బందితో వాహనాలను ఆపి తనిఖీలు చేశారు. అత్యవసరా లపై తిరుగుతున్న వారినే విడిచిపెట్టారు.

Updated Date - 2021-05-08T05:17:58+05:30 IST