Abn logo
Apr 6 2021 @ 16:01PM

అంబులెన్స్​ ఎత్తుకెళ్లి.. పోలీసులకు పట్టపగలే చుక్కలు చూపించిన దొంగ!

డల్లాస్, టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్​ రాష్ట్రం డల్లాస్‌లో పోలీసులకు ఓ దొంగ పట్టపగలే చుక్కలు చూపించాడు. ఏకంగా డల్లాస్ అగ్నిమాపక విభాగానికి చెందిన అంబులెన్స్‌ను ఎత్తుకెళ్లాడు. అది కూడా అగ్నిమాపక కేంద్రం నుంచి వాహనాన్ని దొంగలించడం గమనార్హం. అంతే.. అది చూసిన పోలీసులు అతడ్ని పట్టుకునేందుకు గంటసేపు ఛేజ్ చేయాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సోమవారం మధ్యాహ్నం(అమెరికా కాలమానం ప్రకారం) ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్నిమాపక కేంద్రం నుంచి అంబులెన్స్​ను చోరీ చేసిన దొంగ.. కొలిస్​ కౌంటీ రహదారులపై వాహనాన్ని ఇష్టానుసారంగా నడపడం వీడియోలో ఉంది. దాంతో డల్లాస్ పోలీసులు సుమారు గంట పాటు అంబులెన్స్​ను వెంబడించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇదే వాహనం ఇంతకుముందు కూడా ఒకసారి చోరీ కావడం, లూసియానాలో దొరకడం జరిగింది. దాంతో ఇంతకుముందు కూడా ఈ వ్యక్తినే వాహనాన్ని దొంగిలించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 

(Video Credit by CTV News)


Advertisement
Advertisement
Advertisement