హైదరాబాద్: జీహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల వెలువడనున్న నేపధ్యంలో విజయం సాదించిన పార్టీలనాయకులు,కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని నగర పోలీస్‌కమిషనర్ అంజనీకుమార్ విజ్ఞప్తిచేశారు. విజయం సాధించామన్న సంతోషంలో రోడ్లపైనా, పబ్లిక్‌ప్లేస్‌లలో బాణాసంచా కాల్చడం నిషేధించినట్టు ఆయన తెలిపారు. హైదరాబాద్ పోలీస్‌యాక్ట్ , సెక్షన్-67(సి)ప్రకారం ఆదేశాలను బేఖాతర్చేసే వారిపై కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్, సికింద్రబాద్ పరిధిలో ఈ నిషేదాజ్ఞలు 4వ తేదీ ఉదయం 6గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6గంటల వరకు అమలులో ఉంటాయన్నారు.