Abn logo
Oct 21 2020 @ 10:22AM

విశాఖలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

విశాఖపట్నం: విశాఖలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ బీచ్ రోడ్డులో పోలీస్ అమరవీరుల స్థూపానికి పోలీస్ కమీషనర్ మనీష్ కుమార్ సిన్హా, ఎస్పీ కృష్ణారావు, పోలీస్ ఉన్నతాధికారులు నివాళులర్పించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ... అన్యాయం, అవినీతి, ప్రలోభాలకు లొంగకుండా పోలీసులు విధులు నిర్వహించడమే అమరవీరులకు నిజమైన నివాళన్నారు. పోలీసులు నిజాయితీగా, నిష్పక్షపాతంగా పని చేయ్యాలని తెలిపారు. సమాజంలో ఉన్న సంఘ వ్యతిరేక శక్తులతో పోరాటం చేస్తూనే ఉన్నామని తెలిపారు. పోలీసులు విధి నిర్వాహణలో దేశం కోసం ఎంతో రిస్క్ చేస్తున్నారన్నారు. అమరవీరుల కుటుంబాలకు అండగా ఉండడమే నిజమైన నివాళని తెలిపారు. కష్టంలో ఉన్నవారికి పోలీసులు అండగా నిలవాలని సీపీ మనీష్ కుమార్ సిన్హా పిలుపునిచ్చారు. 

Advertisement
Advertisement