పెళ్లి చేసుకుంటానని చెప్పి మహిళా కానిస్టేబుల్‌పై పోలీసు అత్యాచారం

ABN , First Publish Date - 2020-07-15T12:30:31+05:30 IST

పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నమ్మించి తోటి మహిళా కానిస్టేబులుపై పోలీసు కానిస్టేబుల్ అత్యాచారం చేసిన ఉదంతం...

పెళ్లి చేసుకుంటానని చెప్పి మహిళా కానిస్టేబుల్‌పై పోలీసు అత్యాచారం

నాగపూర్ (మహారాష్ట్ర): పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నమ్మించి తోటి మహిళా కానిస్టేబులుపై పోలీసు కానిస్టేబుల్ అత్యాచారం చేసిన ఉదంతం మహారాష్ట్రలోని నాగపూర్ నగరంలో వెలుగుచూసింది. వెల్టూరు ట్రాఫిక్ పోలీసు విభాగంలో పనిచేస్తున్న పోలీసు కానిస్టేబుల్ తన తోటి ఉద్యోగిని అయిన మహిళా కానిస్టేబుల్ ను పెళ్లి చేసుకుంటానని చెప్పి గత కొంత కాలంగా ఆమెపై పలుసార్లు అత్యాచారం చేశాడు. పోలీసు కానిస్టేబుల్ 2015వ సంవత్సరం నుంచి మహిళా కానిస్టేబుల్ తో శారీరక సంబంధం పెట్టుకొని ఇటీవల మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేర నాగపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-07-15T12:30:31+05:30 IST