Abn logo
Oct 22 2021 @ 18:41PM

మాజీ జవాన్ హత్యకు constable కుట్ర

న్యూఢిల్లీ: రిటైర్డ్ ఆర్మీ జవాన్ హత్యకు కానిస్టేబుల్ కుట్ర పన్నారు. జ్యోతి నగర్‌లో రిటైర్డ్ ఆర్మీ జవాన్‌ను హత్య చేసేందుకు ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్లను కానిస్టేబుల్ నియమించాడు. ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన కానిస్టేబుల్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. సెప్టెంబర్ 10న ఇద్దరు దుండగులు కుమార్‌పై దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. సెప్టెంబర్ 16 న ఢిల్లీ కాంట్‌లోని ఆర్మీ రెఫరల్ ఆసుపత్రిలో సుధీర్ కుమార్ మరణించారు. మృతుడి భార్యతో హెడ్ కానిస్టేబుల్ ఘనాశ్యామ్‌కు సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దుండగుల దాడిలో జవాన్‌కు గాయాలవడంతో అతడిని జీటీబీ ఆసుపత్రికి తీసుకెళ్లారు, తరువాత ఢిల్లీలోని ఢిల్లీ కాంట్‌ ఆర్మీ రిఫరల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కడ జవాన్ సెప్టెంబర్ 16 న మరణించాడు. కుమార్ ఆర్మీ సప్లై కోర్‌లో స్టోర్ కీపర్ క్లర్క్‌గా పనిచేసేవారని, అతను మే 31న పదవీ విరమణ చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో భాగంగా  సీసీటీవీ ఫుటేజీని పరిశీలించామని, హెడ్‌కానిస్టేబుల్ ఇంటి దగ్గర దుండగులు కనిపించినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు కుట్ర పన్నినందుకు మంగళవారం కానిస్టేబుల్‌ను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఇద్దరు దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.

క్రైమ్ మరిన్ని...