సరదాగా పార్క్‌కు వెళ్లిన Police.. సడన్‌గా Kiss చేసిన మరదలు.. ఆ మరుసటిరోజే ఊహించని షాక్..!

ABN , First Publish Date - 2021-11-15T03:42:32+05:30 IST

సరదాగా పోలీస్ క్వార్టర్స్‌ నుంచి తన మరదలితో కలిసి పార్క్‌కు వెళ్లాడో ఖాకీ..

సరదాగా పార్క్‌కు వెళ్లిన Police.. సడన్‌గా Kiss చేసిన మరదలు.. ఆ మరుసటిరోజే ఊహించని షాక్..!

చెన్నై/కోయంబత్తూరు : సరదాగా పోలీస్ క్వార్టర్స్‌ నుంచి తన మరదలితో కలిసి పార్క్‌కు వెళ్లాడో కుర్ర ఖాకీ.. కబుర్లు చెప్పుకుంటూ అటు ఇటు తిరుగుతున్నారు.. పార్క్‌లో ఉన్న వాళ్లంతా వాళ్లవైపు అదో రకంగా చూడసాగారు.. పోలీసు కదా.. ఏదో కేసు పనిమీద తిరుగుతున్నారని అందరూ అనుకున్నారు.. ఆ రేంజ్‌లో బిజిబిజీగా తిరుగుతున్నారు. ఇంతలో మరదలు సడన్‌గా పోలీస్ చెంపపై ముద్దు పెట్టేసింది.. ఎందుకిలా జరిగిందిరా బాబూ.. అని తేరుకునే లోపే జరగాల్సిందంతా జరిగిపోయింది...


తమిళనాడులోని కడలూరు జిల్లాకు చెందిన బాలాజీ (29) అనే కానిస్టేబుల్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి పోలీస్ క్వార్టర్స్‌లో ఉంటున్నాడు. రోజు మాదిరిగానే ఉద్యోగానికి వెళ్లొచ్చిన బాలాజీ.. శుక్రవారం నాడు సరదాగా అటు తిరిగొద్దామని క్వార్టర్స్‌‌కు సమీపంలోని పార్క్‌కు వెళ్లాడు. ఆయనతో పాటు భార్య చెల్లెలు అనగా మరదలు (wife’s sister-in-law) కూడా పార్క్‌కు వచ్చింది. ఇద్దరూ చాలా విషయాలపై చర్చించుకుంటూ పార్క్ అంతా తిరుగుతూ షికారు చేస్తున్నారు. పోలీస్ డ్రస్‌తోనే అతను అలా ఇలా తిరుగుతుండటంతో ఏదో కేసు విషయంపై ఇద్దరూ చర్చించుకుంటున్నారేమో అని పార్క్‌లోని జనాలంతా అనుకున్నారు. ఇంతలో మరదలు ఒక్కసారిగా బాలాజీ చెంపపై ముద్దు పెట్టింది. అప్పటి వరకూ వారిని గమనించిన పార్క్‌లోని ఒక్కసారిగా షాకయ్యారు.. పార్క్‌లో అది కూడా పోలీస్ డ్రస్‌లో ఉన్న వ్యక్తి ఏంటిలా..? అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఇంకొందరైతే తమ మొబైల్ ఫోన్స్‌లో ఫొటోలు, వీడియోలు తీసేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


ఫొటోలు, వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. కొందరు కుర్రాళ్లయితే వీటిని తమిళనాడు పోలీసులు, హోం శాఖకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లను కూడా ట్యాగ్ చేశారు. ఆ నోటా.. ఈ నోటా పడి కోయంబత్తూరు పోలీసు అధికారుల కంటపడటంతో బాలాజీకి ఊహించని షాకిచ్చారు. ఖాకీ డ్రస్‌లో ఉండి ఇలా చేయడమేంటి..? అని కన్నెర్రజేసిన ఉన్నతాధికారులు వెంటనే సస్పెండ్ చేశారు. శుక్రవారం రోజు ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవ్వగా ఆ మరుసటి రోజే.. అతడి చర్య అసభ్యమైనదిగా భావించి బాలాజీని సస్పెండ్ చేస్తున్నట్లు డీసీపీ మురళీధరన్ ఓ ప్రకటనలో తెలిపారు. యూనిఫామ్‌లో ఇలాంటి పాడు పనులు చేస్తే ఎవర్నీ సహించేది లేదని.. ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు చిత్రవిచిత్రాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Updated Date - 2021-11-15T03:42:32+05:30 IST