Advertisement
Advertisement
Abn logo
Advertisement

జహీరాబాద్‌ చోరీ కేసు ఛేదించిన పోలీసులు

సంగారెడ్డి: జిల్లాలో సంచలనం సృష్టించిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. జహీరాబాద్‌లో ఆగస్ట్‌ 27న భారీ చోరీ జరిగింది. ఈ దొంగతనాన్ని పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మీర్‌ఖాజమ్ అలీఖాన్‌ను అరెస్టు చేసారు. నిందితుడి దగ్గర నుంచి 37 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీ కేసు ఛేదించిన సీఐ రాజశేఖర్, ఎస్ఐ శ్రీకాంత్‌ను డీఎస్పీ శంకర్ రాజు అభినందించారు. 

Advertisement
Advertisement